రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సందీప్ కిషన్ మజాకా.. ఎప్పుడంటే.?

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సందీప్ కిషన్ మజాకా.. ఎప్పుడంటే.?

సందీప్ కిషన్ హీరోగా త్రినాధరావు నక్కిన  రూపొందిస్తున్న చిత్రం ‘మజాకా’.  రీతూ వర్మ హీరోయిన్.  రావు రమేష్, అన్షు కీలకపాత్రలు పోషిస్తున్నారు.  ఎకె ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌‌‌‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌‌‌‌‌‌‌‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం మూవీ రిలీజ్ డేట్‌‌‌‌ను ప్రకటించారు. 

శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న  ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్‌‌‌‌మెంట్ పోస్టర్‌‌‌‌‌‌‌‌లో  సందీప్ కిషన్, రీతూ వర్మ స్టైలిష్ అండ్  కలర్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్ అందరినీ ఆకట్టుకుంది. ‘ధమాకా’ తర్వాత త్రినాధరావు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంతో మరోసారి తన కామెడీ మార్క్ చూపించబోతున్నాడని మేకర్స్ తెలియజేశారు. ప్రసన్నకుమార్ బెజవాడ కథ, స్ర్కీన్‌‌‌‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.