![భూమిని తీసుకుని పరిహారం ఇవ్వలేదని.. సుందిళ్ల గ్రామస్తుల ఆందోళన](https://static.v6velugu.com/uploads/2025/02/sundilla-villagers-protest-against-singareni-for-non-payment-of-compensation_ofp5LlYPzb.jpg)
గోదావరిఖని, వెలుగు: సింగరేణి విస్తరణకు తీసుకున్న భూములకు నేటికీ పరిహారం చెల్లించలేదని ఆరోపిస్తూ రామగిరి మండలం సుందిళ్ల గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. ఓపెన్ కాస్ట్5 ప్రాజెక్ట్ వద్దకు వచ్చి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రామగిరి మండలం సుందిళ్ల గ్రామ శివారులోని 31 మంది రైతులకు చెందిన 46 ఎకరాలు 2020లో సింగరేణి తీసుకుందని, ఇప్పటివరకు ఆ భూమికి పరిహారం చెల్లించలేదని ఆరోపించారు.
ఓపెన్‌కాస్ట్ కోసం నిర్వహించిన పబ్లిక్ హియరింగ్టైంలోనూ నష్టపరిహారం చెల్లిస్తామని అప్పటి ఆఫీసర్లు హామీ ఇచ్చారని వాపోయారు. సుమారు మూడు గంటల పాటు ఈ ఆందోళన కొనసాగగా.. టూ టౌన్ సీఐ ప్రసాదరావు, ఓసీపీ మేనేజర్అనిల్ గబాలే, సింగరేణి సెక్యూరిటీ ఆఫీసర్వీరారెడ్డి.. గ్రామస్తుల వద్దకు వెళ్లి ఆఫీసర్లతో మాట్లాడాలని సూచించారు.