విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో రనౌట్ ఒకటి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. షార్జా వేదికగా సోమవారం (అక్టోబర్ 7) జరిగిన ఇంగ్లాండ్, సౌతాఫ్రికా గ్రూప్–బి మ్యాచ్‌లో ఈ సంఘటన నమోదయింది. ఆల్ రౌండర్ సివర్ బ్రంట్ తన అద్భుతమైన స్కిల్ చేసిన రనౌట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ధక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ చివరి ఓవర్లో సివర్ బ్రంట్ వేసిన బంతిని డ్రాక్సన్ బలంగా కొట్టింది. వేగంగా వెళ్తున్న బంతిని బౌలర్ తన పాదాలతో ట్విస్ట్ చేసింది.
నేరుగా వెళ్తున్న బంతి కాస్త వికెట్లను తగిలింది. ఇదే సమయంలో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో నిలబడి ఉన్న సునే లూస్ క్రీజ్ ధాటి వచ్చింది. ఆమె వెనక్కొయి తిరిగే సరికీ అంపైర్ ఔటివ్వడంతో షాక్ అయింది. రెప్పపాటులో జరిగిన ఈ సంఘటన క్రికెట్ ప్రేమికులను ఫిదా చేస్తుంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్ అమ్మాయిలు 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై గెలిచారు. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన సఫారీ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 124/6 స్కోరు మాత్రమే చేసింది. కెప్టెన్ లారా వోల్‌వర్ట్ (39 బాల్స్‌లో 3 ఫోర్లతో 42) సత్తా చాటగా.. మరిజేన్ కాప్ (26), అనెరీ డార్క్‌సెన్ (20 నాటౌట్) రాణించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం సివర్ బ్రంట్ (36 బాల్స్‌లో 6 ఫోర్లతో 48 నాటౌట్), డానీ వ్యాట్ (43 బాల్స్‌లో 4 ఫోర్లతో 43) మెరుపులతో ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 125/3 స్కోరు చేసి గెలిచింది. ఎకిల్‌స్టోన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఇంగ్లిష్ టీమ్ 4 పాయింట్లతో గ్రూప్–బిలో టాప్ ప్లేస్‌లోకి వచ్చింది. ఒక గెలుపు, మరో ఓటమితో సౌతాఫ్రికా మూడో ప్లేస్‌లో ఉంది.