
Suniel Shetty: ఇటీవలి కాలంలో సినీ ప్రముఖులు, ఆటగాళ్లు ఎక్కువగా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీల్లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ సంయుక్తంగా 7 ఎకరాల భూమిని పశ్చిమ థానేలోని ఓవలే ప్రాంతంలో కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.
తాజాగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రికార్డుల్లో వీరి కొనుగోలు గురించిన వివరాలు బయటకు వచ్చాయి. అయితే దీనిని వారు మార్చి నెలలో రూ.9కోట్ల 85 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఇది ఆనంద్ నగర్, కాసర్వడవాలి ప్రాంతాలకు మధ్య ఉందని వెల్లడైంది. అలాగే ఎక్స్ ప్రెస్ వేకు అత్యంత చేరువలో ఉండటంతో ముంబై, థానేతో పాటు కీలక వ్యాపార ప్రాంతాలకు కనెక్టివిటీ బాగుంటుంది.
►ALSO READ | KKR vs PBKS: ‘‘ఏం ఫాల్తూ బ్యాటింగ్ బ్రో ఇది ’’ శ్రేయస్తో రహనే ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఈ డీల్ స్టాంప్ డ్యూటీ ఖర్చులు రూ.68 లక్షల 96వేలుగా ఉండగా, రిజిస్ట్రేషన్ ఖర్చులు రూ.30వేల వరకు అయ్యాయని వెల్లడైంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న వేళ కేఎస్ రాహుల్ బిజీ షెడ్యూల్ లో ఉండగా.. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి వందకు పైగా సినిమాల్లో నటించి అందరికీ సుపరిచితుడు అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ మధ్య చుట్టరికం ఉన్నందున ప్రస్తుత స్థలాన్ని జాయింట్ గా హోల్డ్ చేస్తున్నట్లు వెల్లడైంది.