తెలంగాణ పర్యటనలో ఉన్న బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ బన్సల్ పార్టీ నేతలు, కార్యకర్తలకు టార్గెట్ పెట్టారు. రాబోయే 60 రోజుల్లో 9వేల కార్నర్ మీటింగ్లు పెట్టాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు.. మోడీ విజయాలు, కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. పట్టణాల నుంచి మారుమూల గ్రామాల వరకు ప్రతి ఇంటికి కమలం గుర్తు వెళ్లాలన్నారు. రేపటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించాలని జాయింట్ కన్వీనర్లు, ప్రభారీలు, విస్తారక్ల సమావేశంలో సునీల్ బన్సల్ దిశానిర్దేశం చేశారు.
ఉత్తరప్రదేశ్లో ఇదే వ్యూహాన్ని అమలు చేశామని సునీల్ బన్సల్ తెలిపారు. అక్కడ రెండు సార్లు అధికారంలో వచ్చామని.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోందని చెప్పారు. తెలంగాణలో కూడా బీజేపీనే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. కార్యకర్తలు, నేతలు అందరూ ప్రజల్లోనే ఉండాలని సూచించారు.