ఇవాళ (ఏప్రిల్ 29) రాష్ట్రానికి సునీల్ బన్సల్

ఇవాళ (ఏప్రిల్ 29) రాష్ట్రానికి సునీల్ బన్సల్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి సునీల్ బన్సల్ మంగళవారం రాష్ట్రానికి రానున్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆపార్టీ రాష్ట్ర ఆఫీస్ బేరర్లతో సమావేశం నిర్వహించనున్నారు. బీజేపీ సంస్థాగత ఎన్నికలతోపాటు తెలంగాణలో త్వరలో జరగబోయే ఎన్నికల కార్యాచరణకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించనున్నారు. 

ఇటీవల జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపైనా రివ్యూ చేయనున్నారు. ఇద్దరు కేంద్రమంత్రులు ప్రచారం నిర్వహించినా, కనీసం ఒక్క ఓటు కూడా ఎక్కువ రాకపోవడంపై బీజేపీ హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. హైదరాబాద్​ లోకల్ బాడీ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది.