ఆసియా క్రీడల్లో భారత్ ఫుట్ బాల్ జట్టు గెలిచి నిలిచింది. టోర్నీలో నిలవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచులో సమిష్టిగా రాణించి తొలి విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్ లో చైనా మీద1-5 తేడాతో భారీ పరాజయాన్ని మూట కట్టుకున్న భారత్ ఈ రోజు బంగ్లాదేశ్ పై మాత్రం చాలా జాగ్రత్తగా ఆడుతూ చివర్లో విజయాన్ని సొంతం చేసుకుంది.
హోరాహోరీగా జరిగిన ఈ పోరులో 1-0తో బంగ్లాను చిత్తు ఆశలు ఇంకా సజీవంగానే ఉంచుకుంది. కెప్టెన్ సునీల్ ఛెత్రీ 83వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మలచడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. తొలి అర్ధ భాగంలో బంగ్లా జట్టు గట్టి పోటీనివ్వడంతో భారత్ జట్టుకి గోల్ చేసే అవకాశం రాలేదు. రెండో అర్ధభాగంలో కూడా బంగ్లా ఆటగాళ్లు ప్రతిఘటించడంతో మ్యాచ్ ఇక డ్రా అవుతుందేమో అనుకున్నారు. ఎట్టలకే 83 నిమిషంలో పెనాల్టీ రావడం.. దాన్ని ఛైత్రి గోల్ గా మలచడం.. భారత్ ఆటగాళ్ల సంబరాలు అంతా 10 నిమిషాల్లో జరిగిపోయింది. సెప్టెంబర్ 24న భారత జట్టు మయన్మార్‌ను ఢీకొట్టనుంది.