Sunil Gavaskar: గంభీర్ అర్హుడు కాదు.. ఆ క్రెడిట్ రోహిత్‌కే దక్కాలి: టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం

Sunil Gavaskar: గంభీర్ అర్హుడు కాదు.. ఆ క్రెడిట్ రోహిత్‌కే దక్కాలి: టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం

కాన్పూర్ టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి మూడు రోజుల తర్వాత డ్రా ఖాయమన్న దశలో చివరి రెండు రోజులు రోహిత్ సేన అసాధారణంగా పోరాడి గెలిచింది. దీంతో భారత్ సిరీస్ ను 2-0 తేడాతో గెలుచుకోవడంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో కీలమైన 6 పాయింట్లు సంపాదించింది. ఈ విజయంతో భారత కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ పేరు మారుమ్రోగిపోతుంది. అతను దూకుడు వల్లే టీమిండియా గెలుపు సాధ్యం అని భావించారు. ఈ వ్యాఖ్యలను టీమిండియా దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాక్షర్ కొట్టి పారేశాడు. 

ఇటీవల కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో భారత్ విజయం సాధించిన ఘనత కొత్తగా కోచ్‌గా నియమితులైన గౌతమ్ గంభీర్ కంటే కెప్టెన్ రోహిత్ శర్మకే దక్కుతుందని భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ చెప్పాడు. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు దూకుడు క్రికెట్ శైలిని అవలంబించిందని, ఈ ధైర్యమైన విధానాన్ని వివరించడానికి "గోహిత్" అనే పదాన్ని సూచిస్తున్నట్లు గవాస్కర్ తెలిపాడు. స్పోర్ట్‌స్టార్‌కి రాసిన కాలమ్‌లో, కాన్పూర్ టెస్ట్‌లో జట్టు వ్యూహాత్మక మార్పులకు గానూ గంభీర్ గుర్తింపు పొందడం పట్ల గవాస్కర్ తన నిరాశను వ్యక్తం చేశాడు. 

Also Read : తండ్రి కాబోతున్న భారత అల్ రౌండర్

"బెన్ స్టోక్స్, మెకల్లమ్ రాకతో టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లండ్ బ్యాటింగ్ విధానం పూర్తిగా మారింది. అయితే గత రెండేళ్లుగా రోహిత్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ విజయాలను అందిస్తున్నాడు. గంభీర్ కొన్ని నెలల పాటు కోచ్ గా ఉన్నాడు. క్రెడిట్ అంతా రోహిత్ శర్మకే దక్కుతుంది". అని గవాస్కర్ అన్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను ప్రవేశపెట్టినందుకు ఐసీసీని ప్రశంసించాడు. ఈ విధానం ద్వారా ప్రతి మ్యాచ్ ప్రతి జట్టుకు కీలకమైన ఈ బ్యాటింగ్ దిగ్గజం చెప్పుకొచ్చాడు.