IND vs NZ Final: కుర్రాడిలా గవాస్కర్ చిందులు.. నవ్వు ఆపుకోలేపోయిన యాంకర్

IND vs NZ Final: కుర్రాడిలా గవాస్కర్ చిందులు.. నవ్వు ఆపుకోలేపోయిన యాంకర్

అనుకున్నట్టుగానే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచింది. టోర్నీ మొత్తం ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆధిపత్యం చెలాయించిన భారత జట్టు ఫైనల్లోనూ అంచనాలకు తగ్గట్టుగా రాణించి న్యూజిలాండ్ కు ఓడించింది. దుబాయ్ ఇంటర్నేషనల్​ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఇండియా 4 వికెట్ల తేడాతో కివీస్ ను ఓడించింది. ఏడాది కిందటే టీ20 వరల్డ్ కప్ నెగ్గిన ఇండియా ఇప్పుడు మరో ఐసీసీ ట్రోఫీతో తన ఖ్యాతిని పెంచుకుంది. ఫైనల్ గెలిచిన తర్వాత టీమిండియా ఫ్యాన్స్ తో పాటు ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన డ్యాన్స్ హైలెట్ గా నిలిచింది.  

Also Read :- 2027 వన్డే వరల్డ్ కప్‌కు కోహ్లీ, రోహిత్

టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ భారత క్రికెట్ జట్టును ఎప్పటికప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడు. జట్టు ఓడిపోతే  తప్పులను నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. గెలిస్తే ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తాడు. భారత జట్టు విజయాన్ని తన విజయంగా భావిస్తూ మురిసిపోతూ ఉంటాడు. తాజాగా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన తర్వాత గవాస్కర్ తన ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. టీమిండియా టైటిల్ గెలిచిందన్న ఆనందంలో గ్రౌండ్ లో సంతోషంతో డ్యాన్స్ వేస్తూ కనిపించాడు. గవాస్కర్ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుండగా   స్పోర్ట్స్ ప్రెజెంటర్ మాయంతి లాంగర్ తన నవ్వును ఆపుకోలేకపోయింది.

ఒక దిగ్గజ క్రికెటర్ చిన్న పిలాడిలా చిందులు వేయడం ముచ్చట గొలిపే విధంగా ఉంది. మ్యాచ్ తర్వాత గవాస్కర్ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మెగా ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగుల మోస్తరు స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలిచింది. భారత విజయంలో రోహిత్ శర్మ (76: 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో కీలక పాత్ర పోషించాడు. 48 పరుగులు చేసి అయ్యర్ రాణించాడు.