
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లేకపోవడం క్రికెట్ ప్రేమికులకు తీవ్ర నిరాశను కలిగించింది. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకున్న విరాట్.. చివరి మూడు టెస్టులకు కూడా దూరమవ్వడంతో సిరీస్ కల తప్పిందని అభిమానులు భావిస్తున్నారు. దీంతో ఐపీఎల్ లో విరాట్ ను చూడాలని అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ కోహ్లీ కంబ్యాక్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
స్టార్ స్పోర్ట్స్ స్టార్ ఈవెంట్ సందర్భంగా రాంచీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విద్యార్థులతో గవాస్కర్ మాట్లాడారు. ఈ కార్యక్రంలో ఐపీఎల్ లో కోహ్లి ఎలా ఆడతాడు.. తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటాడా అనే ప్రశ్నకు గవాస్కర్ కోహ్లీ ఐపీఎల్ ఆడతాడా ..? కొన్ని కారణాల వల్ల ఇంగ్లాండ్ సిరీస్ ఆడలేదు. బహుశా అతను ఐపీఎల్‌లో ఆడకపోవచ్చు. అని చెప్పాడు. ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22న చెపాక్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ ఈ ఐపీఎల్‌లో సూపర్‌స్టార్ కావొచ్చని గవాస్కర్ అన్నాడు. పంత్ గురించి మాట్లాడుతూ.. నేను కూడా అతనికి పెద్ద అభిమానిని. అతను మునుపటిలా ఆరోగ్యంగా ఉండాలి. గ్రౌండ్ లోకి దిగి తన బ్యాటింగ్ తో అలరించాలని గవాస్కర్ చెప్పుకొచ్చారు. ఆర్సీబీ తరపున ఆకాష్ దీప్ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా మారొచ్చని అభిప్రాయపడ్డాడు.
Sunil Gavaskar's cheeky remark on Virat Kohli's absence from international cricket. pic.twitter.com/w0dmjeujNF
— CricTracker (@Cricketracker) February 27, 2024