ఐపీఎల్ లో నిన్న (ఏప్రిల్ 20) సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 67 రన్స్ తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆటలో గెలుపోటములు సహజమే అయినా.. ఈ మ్యాచ్ లో పంత్ నిరాశ చెందడం సగటు క్రికెట్ అభిమానిని కలచి వేసింది. రిషబ్ పంత్ (34 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 44) చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. మ్యాచ్ అనంతరం పంత్ తన తల వంచుకొని నిరాశగా మాట్లాడడంతో సునీల్ గవాస్కర్ అతనిని ఎంకరేజ్ చేస్తూ ఓదార్చే ప్రయత్నం చేశాడు.
ప్రస్తుతం ఐపీఎల్ లో గవాస్కర్ కామెంటేటర్ గా ఉన్నాడు. పంత్ బాధను గమనించిన గవాస్కర్.. "టోర్నీలో ఇంకా చాలా మ్యాచ్ లు ఉన్నాయి. తప్పకుండా మీ జట్టు పుంజుకుంటుంది. నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. నీ తలను ఎప్పుడు దించకూడదని కోరుకుంటున్నాను". అని గవాస్కర్ అన్నాడు.
Also Read: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు.. తుది జట్టులో సిరాజ్, గ్రీన్
పవర్ ప్లే లో హైదరాబాద్ దూకుడుగా ఆడటం వలనే మ్యాచ్ ఓడిపోయిందని.. ఈ దశలో మా ప్లేయర్లు ఒత్తిడిలోకి వెళ్లిపోయారని పంత్ అన్నాడు. బ్యాటింగ్ లో 230 పరుగుల లక్ష్యం ఉంటే ఛేజ్ చేసేవాళ్లమని.. కానీ 260 పరుగుల లక్ష్యం వల్ల వెనుకపడిపోయామని ప్యాంటు అన్నాడు. ఫ్రెజర్ గురించి అతనిపై ప్రశంసలు కురిపించాడు. అతని అద్భుతంగా ఆడాడని.. అతనిచ్చిన శుభారంభం చివరి వరకు కొనసాగించలేకపోయామని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ తెలిపాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలుత హైదరాబాద్ 20 ఓవర్లలో 266/7 స్కోరు చేసింది. ట్రావిస్ హెడ్ (32 బాల్స్‌లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 89), షాబాజ్ అహ్మద్ (29 బాల్స్‌లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 నాటౌట్), అభిషేక్ శర్మ (12 బాల్స్‌లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 46) దంచికొట్టారు. ఛేజింగ్‌లో డీసీ 19.1 ఓవర్లలో 199 రన్స్‌కు ఆలౌటై ఓడింది. జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (18 బాల్స్‌లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 65), అభిషేక్ పోరెల్ (22 బాల్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 42) పోరాటం సరిపోలేదు.
Sunil Gavaskar said "I never want your head down, there are lots of games so keep a smile always".
— Johns. (@CricCrazyJohns) April 20, 2024
Pant replied "I will try my best, sir". pic.twitter.com/UEpb2iCsjK