ఈ పని చేస్తే టీమిండియాదే వరల్డ్ కప్..

వన్డే వరల్డ్ కప్ 2023 మరో రెండు నెలల్లో మొదలవబోతుంది. భారత్ వేదికగా జరిగే ఈ మెగా ఈవెంట్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై వరల్డ్ కప్ విజేతగా నిలవాలని టీమిండియా  భావిస్తుండగా.. ఈ అంశంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు వరల్డ్ కప్ ను దక్కించుకోవాలంటే ఈ పని చేయాల్సిందేనంటున్నాడు. 

భారత్ వరల్డ్ కప్ గెలవాలంటే..

వన్డే వరల్డ్ కప్ లో భారత్ తో పాటు..పాక్, ఆసీస్ జట్లు ఫేవరెట్ అని సునీల్ గవాస్కర్ అన్నాడు. అయితే ఈ రెండు జట్లపై టీమిండియా విజయం సాధిస్తే ఈజీగా వన్డే వరల్డ్ కప్  గెలుస్తుందని సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. ఆస్ట్రేలియాకు పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉందని..కాబట్టి  టీమిండియా ఆసీస్ గెలవడం అంత సులభం కాదన్నాడు. అయితే వరల్డ్ కప్ లో తొలి మ్యాచులోనే భారత జట్టు ఆసీస్ తో ఆడనుండటం మంచి అడ్వాంటేజ్ అని చెప్పాడు. పాకిస్థాన్‌ కు కూడా మంచి బౌలింగ్ విభాగం ఉందని సునీల్ గవాస్కర్ అన్నాడు. కాబట్టి...మొదటి 3 మ్యాచుల్లో  ఈ కీలకమైన రెండింటిలో  తప్పక గెలవాలన్నాడు. 

గెలిస్తే లాభమేంటి..

ఆసీస్, పాక్ పై టీమిండియా గెలిస్తే  మిగిలిన జట్లను ఓడించడం కష్టమేమీ కాదని సునీల్ గవాస్కర్ అన్నాడు. ఒకవేళ ఆస్ట్రేలియాపై  భారత జట్టు ఓడిపోతే.. మిగిలిన జట్లతో ఎలా ఆడాలనే దానిపై  క్లారిటీ వస్తుందని చెప్పాడు. వ్యూహాలు, ప్లాన్స్ మార్చుకోవచ్చన్నాడు. ఆసీస్, పాక్ పై గెలిస్తే  మిగిలిన జట్లను ఓడించడం భారత్ కు పెద్ద కష్టమేమి కాదన్నాడు. ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి పెద్ద జట్లను టీమిండియా  సొంతగడ్డపై ఓడించగలదన్నాడు. మొదట బలమైన ప్రత్యర్థులపై గెలిస్తే ఆ తర్వాత బలహీనమైన జట్లతో ఈజీగా గెలిచే ఛాన్సుందన్నాడు.  అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదని సూచించాడు. టీమిండియా సెమీస్‌ చేరి..అందులో  గెలిస్తే.. అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌లో ప్రత్యర్థి ఎవ్వరైనా సరే రోహిత్ సేన ఖచ్చితంగా  ఓడిస్తుందని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

ALSO READ:ఈ కార్ల ధరలు పెరుగుతున్నాయి.. ఇప్పుడే కొనేయండి..

మ్యాచులు ఎప్పుడు..

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ మొదలవుతుంది. టీమిండియా తన తొలి మ్యాచ్  అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఆ తర్వాత  అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్‌తో రెండో మ్యాచులో తలపడనుంది.