ఆస్ట్రేలియా- భారత్ జట్ల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి రోజు రోజుకు భారీ లెవల్లో హైప్ పెరుగుతుంది. ఈ మెగా టోర్నీ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉండడం గ్యారంటీగా కనిపిస్తుంది. అగ్ర జట్లు.. స్టార్ ఆటగాళ్లు.. స్టేడియం నిండా ప్రేక్షకులు.. అసలు సిసలు టెస్ట్ క్రికెట్ మజా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సిరీస్ పై ఇప్పటికే దిగ్గజాలు తమ ప్రిడిక్షన్ ను తెలిపారు. తాజాగా ఈ టోర్నీలో విజేతగా ఎవరు నిలుస్తారో భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన జోస్యాన్ని తెలిపాడు.
ఈ ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై భారత్ 3-1తో విజయం సాధిస్తుందని లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. " రెండు జట్లు అద్భుతంగా ఉన్నాయి. ప్రతిభ గల ఆటగాళ్లు ఉన్నారు. టెస్ట్ మ్యాచ్ క్రికెట్ నాకిష్టమైన ఆట. నా అంచనా ప్రకారం.. భారత్ 3-1 తేడాతో విజయం సాధిస్తుంది". అని గవాస్కర్ ఆదివారం తన కాలమ్‌లో రాశాడు. డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటింగ్ బలహీనంగా మారిందని.. అయితే మిడిల్ ఆర్డర్ అత్యంత పటిష్టంగా ఉందని గవాస్కర్ తెలిపారు.
Also Read:-పుజారా, రహానే స్థానాలను వారిద్దరే భర్తీ చేయగలరు
1991–92 తర్వాత ఇరుజట్ల మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్‌గా నిర్వహించడం ఇదే తొలిసారి. గతంలో ఎక్కువగా నాలుగు టెస్ట్‌ల సిరీస్‌గానే నిర్వహించేవారు.సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22న పెర్త్ లో జరుగుతుంది. డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్ వేదికగా రెండో టెస్టు డే నైట్ జరుగుతుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు గబ్బాలో మూడో టెస్ట్.. డిసెంబర్ 26 నుంచి 30 వరకు ఎప్పటిలాగే నాలుగో టెస్ట్ బాక్సింగ్ డే రోజున ప్రారంభమవుతుంది.మెల్బోర్న్ లో ఈ టెస్ట్ జరుగుతుంది. చివరిదైన ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీ వేదికగా జరుగుతుంది.