IND vs AUS Final: మ్యాచ్ ఓడినా.. 140 కోట్ల మంది హృదయాలు గెలిచాం : గవాస్కర్

IND vs AUS Final: మ్యాచ్ ఓడినా.. 140 కోట్ల మంది హృదయాలు గెలిచాం : గవాస్కర్

వరల్డ్ కప్ మొత్తం అద్భుత ఆటతీరును ప్రదర్శించిన భారత క్రికెట్ జట్టు ఫైనల్లో ఆసీస్ జట్టుపై అనూహ్యంగా ఓడింది. టీమిండియా జోరును చూస్తే 12 ఏళ్ళ తర్వాత వరల్డ్ గెలుస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. 241 పరుగుల లక్ష్యంతో దిగిన ఆసీస్ జట్టు ప్రారంభంలో మూడు వికెట్లు కోల్పోయినా హెడ్(137), లబుషేన్(58) భారీ భాగస్వామ్యంతో ఆరోసారి వరల్డ్ కప్ గెలిచింది. ఈ పరాజయంతో భారత ఆటగాళ్లు కుంగిపోగా దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ భారత్ జట్టును ఓదార్చే ప్రయత్నం చేసాడు.
 
టోర్నీ అంతటా భారత ఆటగాళ్లు బాగా రాణించినందుకు గర్వపడుతున్నానని..అత్యున్నత జట్టు చేతిలో ఓడిపోయినందుకు బాధగా లేదని భారత జట్టుకు తన మద్దతు తెలిపాడు. ఈ రోజు మనం విచారంగా ఉన్నా మన జట్టును చూసి చాలా గర్వపడాలని.. ఆటలో ఇదంతా సహజమని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా ఈ రోజు అద్భుతమైన క్రికెట్ ఆడింది. వారి చేతిలో ఓడిపోయినందుకు అవమానకరంగా భావించాల్సిన అవసరం లేదని గవాస్కర్ పేర్కొన్నాడు. 

ఈ టోర్నీలో ఆడిన 9 లీగ్ మ్యాచ్ లతో పాటు సెమీస్ లో న్యూజీలాండ్ పై భారత్ అద్భుతమైన విజయం సాధించింది. మరో వైపు టోర్నీలో తొలి రెండు మ్యాచ్ లను ఓటములతో ఆరంభించి వరుసగా 10 మ్యాచ్ ల్లో గెలిచి ఆరవసారి విశ్వ విజేతగా నిలిచింది. 2015, 2019 లో టేబుల్ టాపర్ గా నిలిచిన టీమిండియా సెమీస్ లో ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే.