ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటలు భాగంగా టీమిండియా బ్యాటర్లు విఫలమయ్యారు. వచ్చినవారు డిఫెన్స్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా చెత్త షాట్ సెలక్షన్ తో వికెట్ సమర్పించుకున్నారు. జైశ్వాల్, గిల్, పంత్ లాంటి యంగ్ ప్లేయర్లతో పాటు ఎంతో అనుభవమున్న విరాట్ కోహ్లీ సైతం చెత్త షాట్ ఆడి ఔటయ్యాడు. భారత బ్యాటింగ్ తీరుపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. భారత ఆటగాళ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు.
భారత ఆటగాళ్లు ఆరంభంలోనే షాట్స్ ఆడడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని గవాస్కర్ అన్నారు. టీమిండియా ఆటగాళ్ల షాట్ సెలక్షన్ పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వేగంగా పరుగులు చేయాల్సిన అవసరం లేదని.. మీరు అరగంటలో 445 పరుగులు చేయలేరని ఆయన తెలిపారు. పిచ్ పై ఎలాంటి ఫిర్యాదు చేయలేమని.. భారత ఆటగాళ్లు చెత్త షాట్ ఆడి ఔటయ్యారని ఆయన అన్నారు. ఈ మ్యాచ్ లో జైశ్వాల్ (4), గిల్ (1), కోహ్లీ (3), పంత్ (9) సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు. దీంతో భారత్ డ్రా కోసం పోరాడుతుంది.
ప్రస్తుతం గబ్బా టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే భారత్ భారత్ డ్రా కోసం పోరాడుతుంది.నాలుగో రోజు లంచ్ తర్వాత 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. క్రీజ్ లో జడేజా (52),నితీష్ కుమార్ రెడ్డి (9) క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 265 పరుగుల దూరంలో వెనకబడి ఉంది. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే మరో 65 పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో కమ్మిన్స్, స్టార్క్ రెండో వికెట్లు తీసుకున్నారు. లియాన్, హేజాల్ వుడ్ తలో వికెట్ పడగొట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ అయింది.