Sunil Gavaskar: 25 పరుగులు జట్టుకు సరిపోతాయా..? రోహిత్, గంభీర్‌లపై గవాస్కర్ ఫైర్

Sunil Gavaskar: 25 పరుగులు జట్టుకు సరిపోతాయా..? రోహిత్, గంభీర్‌లపై గవాస్కర్ ఫైర్

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అద్బుతంగా ఆడుతుంది. వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకెళ్లింది. దుబాయ్ వేదికగా ఆదివారం (మార్చి 9) జరగబోయే ఫైనల్లో న్యూజిలాండ్ తో టైటిల్ కోసం తలపడుతుంది. జట్టులో ఆటగాళ్లందరూ సూపర్ ఫామ్ లో ఉన్నారు. గిల్, కోహ్లీ, రాహుల్, పాండ్య బ్యాటింగ్ లో అదరగొట్టేస్తున్నారు. స్పిన్నర్లతో పాటు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అంచానాలను అందుకుంటున్నారు. రోహిత్ శర్మ సూపర్ కెప్టెన్సీతో జట్టును విజయవంతంగా తీసుకెళ్తున్నాడు.

ఇంతవరకు బాగానే ఉన్నా రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫామ్ భారత జట్టును కలవరపెడుతుంది. పవర్ ప్లే లో మంచి ఆరంభాలు ఇస్తున్నా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. రెండు, మూడు బౌండరీలు కొట్టి 30 పరుగుల లోపే ఔటవుతున్నాడు. ఇప్పటివరకు హిట్ మ్యాన్ బ్యాట్ నుంచి ఒక్క హాఫ్ సెంచరీ కూడా రాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. రోహిత్ పేలవ ఫామ్ పై టీమిండియా మాజీ దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ ప్రశ్నించాడు.

టీమిండియా కెప్టెన్ తో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై ఫైరయ్యాడు. ఇటీవలే రోహిత్ బ్యాటింగ్ లో విఫలమైనా గంభీర్ అతన్ని సమర్ధిస్తూ వస్తున్నాడు. పవర్ ప్లే లో రోహిత్ కొట్టే బౌండరీలు.. అతని స్ట్రైక్ రేట్ జట్టుపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. అని వెనకేసుకొచ్చాడు. ఈ మాటలపై తాజాగా సునీల్ గవాస్కర్ స్పందించారు.  

ALSO READ | David Miller: అంత మాట అనేశావు ఏంటి బాస్.. టీమిండియా ఫ్యాన్స్‌ను నిరాశ పరిచిన మిల్లర్

గవాస్కర మాట్లాడుతూ.. "రోహిత్ శర్మ 25 ఓవర్లు బ్యాటింగ్ చేయగలిగితే ఇండియా 180-200 పరుగులు చేస్తుంది. అప్పటికీ టీమిండియా రెండు వికెట్లు మాత్రమే కోల్పోతే ఈజీగా 350 కి పైగా పరుగుల మార్క్ ను చేరుకుంటుంది. 25 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ ను ప్రత్యర్థి నుంచి లాగేసుకుంటాడు. పవర్ ప్లే లో 7 లేదా 8 ఓవర్లు బ్యాటింగ్ చేసి 25 నుంచి 30 పరుగులు చేస్తే జట్టుకు పెద్దగా ప్రయోజనం ఉండదు. 25ఓవర్ల పాటు రోహిత్ బ్యాటింగ్ చేయగలిగితే జట్టు విజయంపై ఎంతగానో ప్రభావం చూపుతుంది". అని గవాస్కర్ అన్నారు.