
సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన 41ఏ CRPC నోటీసులపై కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 30 న విచారణకు రావాలని పోలీసులు సునీల్ కు నోటీసులు ఇచ్చారు. అయితే ఆ వాటిని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 41 ఏ CRPC పై స్టే ఇవ్వాలని తన పిటిషన్ లో కోరారు. దీనిపై హైకోర్టు రేపు విచారణ జరపనుంది.
సీఎం కేసీఆర్ తో పాటు ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని సునీల్ కనుగోలుపై ఆరోపణలు ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 15 న ఆయన ఆఫీసులోసైబర్ క్రైమ్ పోలీసులు తనిఖీలు చేసి ముగ్గురిని ఆదుపులోకి తీసుకున్నారు. అనంతరం సునీల్ కనుగోలుకు నోటీసులు పంపారు.