
అమరావతి: ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్ లభించింది. పి.వి.సునీల్‌కుమార్ సహా 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారులకు డీజీపీ ర్యాంకులు వచ్చాయి. పి.వి.సునీల్‌కుమార్, మహేష్ దీక్షిత్, అమిత్‌గార్గ్ ఆ లిస్టులో ఉన్నారు. ప్రస్తుతం ఏపీ సీఐడీ అదనపు డీజీపీగా ఉన్న పీవీ సునీల్ కుమార్ డీజీపీగా నియమితులయ్యారు. డీజీపీ ర్యాంకులో పి.వి.సునీల్‌కుమార్ సీఐడీ చీఫ్‌గా పనిచేయనున్నారు. మహేష్దీక్షిత్, అమిత్‌గార్గ్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం డిప్యుటేషన్లో ఉన్నారు.
ఏపీ సీఐడీ అదనపు డీజీపీగా ఉన్న సునీల్ కుమార్ సీఐడీ చీఫ్ గా ప్రమోట్ కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. తనకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్ ను కలిసి కృతజ్ఞతలు చెప్పారు.