బాల్కొండ, వెలుగు: బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఏర్గట్ల మండలం బట్టాపుర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ వైస్ ప్రెసిడెంట్, వార్డ్ మెంబర్ భూషణవేని నరేందర్, బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ కు చెందిన మైనార్టీ యువకులు, భీమ్ గల్ మండలం పల్లికొండ వీడీసీ సభ్యులు, ఏర్గట్ల, తాళ్లరాంపూర్ తదితర గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరారు.
ఈ సందర్భంగా సునీల్ కుమార్మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి అవినీతి ఎక్కువైందని, యువతకు గంజాయి అలవాటు చేస్తూ వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారన్నారు. కాంట్రాక్టుల్లో కోట్ల రూపాయల కమీషన్లు తీసుకుంటున్నారన్నారు. అందుకే అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తుందన్నారు. కాంగ్రెస్అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు.