MI vs KKR: ముంబైతో మ్యాచ్‌కు సునీల్ నరైన్.. మ్యాచ్ విన్నింగ్ ఆల్ రౌండర్‌పై వేటు!

MI vs KKR: ముంబైతో మ్యాచ్‌కు సునీల్ నరైన్.. మ్యాచ్ విన్నింగ్ ఆల్ రౌండర్‌పై వేటు!

ఐపీఎల్ లో సోమవారం (మార్చి 31) బ్లాక్ బస్టర్ పోరుకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ తో ముంబై ఇండియన్స్ తలబడుతుంది. ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన హార్దిక్ సేన సొంతగడ్డపై ఎలాగైనా విజయం సాధించాలని కోరుకుంటుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ పై ఇచ్చిన గెలుపుతో కేకేఆర్ తమ విన్నింగ్ స్ట్రీక్ ను కొనసాగించాలనుకుంటుంది. మ్యాచ్ కు ముందు రహానే సేనకు ఒక గుడ్ న్యూస్ అందింది. స్టార్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ నేడు జరగబోయే మ్యాచ్ లో ఆడడం కన్ఫర్మ్ అయింది. 

కోల్‌కతా నైట్ రైడర్స్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ సునీల్ నరైన్ ఫిట్ గా ఉన్నాడని ధృవీకరించాడు. "సునీల్ 100% ఫిట్‌గా ఉన్నాడు. అతను పూర్తిగా కోలుకున్నాడు. నిన్నటి నుండి ప్రాక్టీస్ చేస్తున్నాడు" అని ఆయన చెప్పారు. సునీల్ నరైన్ లేకుండానే రాజస్థాన్ తో కోల్ కతా మ్యాచ్ గెలిచింది. ఇప్పుడు అతని రాకతో కేకేఆర్ మరింత పటిష్టంగా మారనుంది. నరైన్ అనారోగ్యం కారణంగా రాజస్థాన్ మ్యాచ్ కు దూరమయ్యాడు. దీంతో 1435 రోజుల తర్వాత నరైన్ ఐపీఎల్ మ్యాచ్ మిస్ అయ్యాడు. చివరిసారిగా నరైన్ 2021 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మ్యాచ్ మిస్ అయ్యాడు. 

Also Read :- రాజస్థాన్ కెప్టెన్ ఓవరాక్షన్..సెల్ఫీ ఇచ్చి ఫోన్ పడేశాడు

నరైన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన మొయిన్ అలీ ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ పై జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి నితీష్ రాణా, జైశ్వాల్ వికెట్లను పడగొట్టాడు. నరైన్ జట్టులో చేరడంతో మొయిన్ బెంచ్ కే పరిమితం కానున్నాడు. అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ పై వేటు తప్పదు. డికాక్ ఓపెనర్ గా ఉండడం ఖాయం. ఆండ్రీ రస్సెల్ ను తొలగించే అవకాశమే లేదు. ఫారెన్ ఫాస్ట్ బౌలర్ గా స్పెన్సర్ జాన్సెన్, అన్రిచ్ నోర్ట్జే లలో ఒకరికి అవకాశం దక్కనుంది.