టీ20 క్రికెట్ లో సునీల్ నరైన్ కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ లీగ్ జరిగినా ఈ విండీస్ స్పిన్నర్ ను పోటీ పడి మరీ తీసుకుంటారు. దశాబ్ద కాలానికి పైగా టీ20 క్రికెట్ లో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికీ నరైన్ స్పిన్ ఒక మిస్టరీనే. తన స్పిన్ మాయాజాలంతో టీ20 క్రికెట్ లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్న నరైన్ తాజాగా ఒక అరుదైన మైలురాయిని తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమయ్యాడు.
నరైన్ ప్రస్తుతం ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు. ఇప్పటివరకు టీ20 క్రికెట్ లో 499 మ్యాచ్ లాడిన ఈ మిస్టరీ స్పిన్నర్.. నేడు (మార్చి 29) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడే మ్యాచ్ తో తన టీ20 కెరీర్ లో 500 మ్యాచ్ లు పూర్తి చేసుకోనున్నాడు. నరైన్ కంటే ముందు కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో మరియు షోయబ్ మాలిక్ 500 టీ20 మ్యాచ్ లను పూర్తి చేసుకున్నారు. పొలార్డ్ 660 మ్యాచ్ లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
Also Read: అమెరికా తరపున న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్
నరైన్ 2011లో T20 ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్ లో ఇప్పటివరకు 536 టీ20 వికెట్లను తన ఖాతాలో వేసుకొని ఈ ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న మూడో ఆటగాడిగా నిలిచాడు. ఈ లిస్టులో వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో 625 వికెట్లతో టాప్ లో ఉన్నాడు. రషీద్ ఖాన్ 566 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో నిలిచాడు. నరైన్ ఎకానమీ రేట్ కేవలం 6.10 మాత్రమే ఉండడం విశేషం. మొత్తం తన టీ20 క్రికెట్ లో30 మెయిడెన్ ఓవర్లు వేశాడు.
Sunil Narine will be playing his 500th T20 match tonight.
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 29, 2024
- He'll become the first spinner in history to achieve the landmark..!!! pic.twitter.com/u7SQ5YkxXn