
కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ బంధం విడదీయలేనిది. 14 సీజన్ లుగా కేకేఆర్ జట్టు తరపున ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు. జట్టులో ఎవరు వచ్చి వెళ్లినా ఈ విండీస్ మిస్టరీ స్పిన్నర్ మాత్రం కామన్ గా ఉంటాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో కోల్‌కతా తరపున తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న నరైన్.. ఐపీఎల్ చరిత్రలో ఒక ఆల్ టైమ్ రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈడెన్ గార్డెన్ వేదికగా గురువారం (ఏప్రిల్ 3) సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో కామిందు మెండీస్ వికెట్ తీసుకోవడం ద్వారా ఈ విండీస్ స్పిన్నర్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.
మెండీస్ వికెట్ తో ఐపీఎల్ లో ఒకే జట్టుకు ఆడుతూ 200 వికెట్లు తీసుకున్న బౌలర్ గా నరైన్ తొలి బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. ముంబై ఇండియన్స్ తరపున లసిత్ మలింగ 195 వికెట్లతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ లో నరైన్ మొత్తం 182 వికెట్లు పడగొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఆడుతూ 18 వికెట్లు తీసుకున్నాడు. 2012 ఐపీఎల్‌లో కేకేఆర్ తొలిసారి టైటిల్ గెలుచుకున్నప్పుడు నరైన్ 24 వికెట్లు పడగొట్టాడు. 2014లో కేకేఆర్ రెండవ ట్రోఫీ సాధించినప్పుడు 21 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక గత సీజన్ లో కోల్ కతా విజేతగా నిలిచినప్పుడు 17 వికెట్లు పడగొట్టాడు.
ప్రపంచ క్రికెట్ లో ఓవరాల్ గా ఈ రికార్డ్ సమిత్ పటేల్ పేరిట ఉంది. ఈ ఇంగ్లాండ్ స్పిన్నర్ నాటింగ్‌హామ్‌షైర్ తరఫున 208 వికెట్లు తీసి టాప్ లో ఉన్నాడు. నరైన్ ఈ ఐపీఎల్ ముగిసేసరికి సమితి పటేల్ రికార్డ్ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ సీజన్ లో కనీసం 10 మ్యాచ్ లు ఆడుతుంది. ఈ 10 మ్యాచ్ ల్లో 9 వికెట్లు పడగొడితే ఒకే జట్టు తరపున టీ20 క్రికెట్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో నరైన్ ఇప్పటివరకు 3 మ్యాచ్ లు ఆడి 2 వికెట్లు తీసుకున్నాడు.
Sunil Narine becomes only the second bowler in T20 history to take 200 wickets for a single team ⚡🔥
— Sportskeeda (@Sportskeeda) April 4, 2025
He achieved this milestone while playing for Kolkata Knight Riders in the IPL 💜✨#IPL2025 #SunilNarine #KKR #Sportskeeda pic.twitter.com/5lVEMZcDaa