కరీంనగర్ టౌన్,వెలుగు: మతం పేరిట ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడమే ఎంపీ బండి సంజయ్ పద్దతి అని మేయర్ సునీల్ రావు ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై వాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కరీంనగర్ ప్రజలకు సంజయ్ ఎంపీగా ఉండటం దురదృష్టకరమన్నారు. నాలుగున్నరేళ్లలో జిల్లా అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో తెలియచేయాలని డిమాండ్ చేశారు. చెల్లని రూపాయితో సమానమని బండిపై ఆయన మండిపడ్డారు. .
ఎంపీ సంతోష్ ను కలిసిన మేయర్
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ను కరీంనగర్ లోని తన నివాసంలో సోమవారం మేయర్ సునీల్ రావు కలిసి బోకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నగర రూపురేఖలు మారిపోయాయని ప్రశంసించారు.