సీఎం రేవంత్ను కలిసిన సునీల్ రెడ్డి

సీఎం రేవంత్ను కలిసిన సునీల్ రెడ్డి

బాల్కొండ, వెలుగు: బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్​ఇన్​చార్జి ముత్యాల సునీల్​రెడ్డి సోమవారం  హైదరాబాద్​లో క్యాంప్​ఆఫీస్​లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో సమస్యలను వివరించారు. పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గంలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయని, వాటిపై విచారణ చేయించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.