
శివ్వంపేట, వెలుగు : తప్పుడు మాటలు చెప్పే కాంగ్రెస్ను నమ్మొద్దని నర్సాపూర్ బీఆర్ఎస్అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి బుధవారం మండలంలోని దంతాన్ పల్లి, కొంతాన్ పల్లి, మల్లుపల్లి, దొంతి, మగ్దుమ్ పూర్, శబాష్ పల్లి లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ గెలిస్తే అసైన్డ్ భూములపై రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తుందన్నారు. అధికారంలోకి రాగానే సిలిండర్ ను రూ.400 కే అందజేస్తుందన్నారు.
Also Read : వృధాగా పోతున్న తాగునీరు.. పట్టించుకోని అధికారులు
గృహలక్ష్మి కింద రూ.4 లక్షలు ఇవ్వాలని దంతాలపల్లి గ్రామస్థులు కోరారు. దేవాదాయ భూముల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో లైబ్రరీ చైర్మన్ చంద్ర గౌడ్, ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేశ్ గుప్తా, మన్సూర్ అలీ, పార్టీ మండల అధ్యక్షుడు రమణ గౌడ్, సొసైటీ చైర్మన్ వెంకటరామిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.