హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యవర్గాన్ని ఆ విభాగం అధ్యక్షురాలు సునీతారావు ప్రకటించారు. శుక్రవారం ఇందిరా భవన్లో సమావేశమైన మహిళా కాంగ్రెస్ ముఖ్య నేతల సమక్షంలో జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబా అనుమతితో ఈ కమిటీని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఇందులో 11 మంది రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్స్, నలుగురు జనరల్ సెక్రటరీలు, 18 మంది సెక్రటరీలను నియమిస్తూ వారికి నియామక పత్రాలను అందజేశారు. 17 జిల్లాలకు ప్రెసిడెంట్లను కూడా నియమించారు.
ఆన్ లైన్ లో మహిళా కాంగ్రెస్ సభ్యత్వాలను ఎక్కువగా చేయించిన వారికి, బీఆర్ఎస్ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడి, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కృషి చేసిన వారికి ఈ పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆమె చెప్పారు.