బీఆర్​ఎస్​ హయాంలో మహిళలకు రక్షణ లేదు

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు విమర్శించారు. పోకిరీల బెడదతో మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. అందుకే బీఆర్ఎస్​ను బంది పోట్ల రాష్ట్ర సమితి అని పిలిచామని పేర్కొన్నారు. మంగళవారం ఆమె గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చింది కేసీఆర్ అని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ మహిళలకు రక్షణ లేకుండా పోయిందనే విషయం రాహుల్​గాంధీ చేపట్టిన భారత్​జోడో న్యాయ్​యాత్రతో తెలిసిందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టకుండా బీజేపీ ఎందుకు తాత్సారం చేస్తున్నదని మండిపడ్డారు.

ALSO READ : నల్గొండలో సభ పెట్టి తీరుతం: కేసీఆర్