వాయిదా పడ్డ సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర

భారత సంతతికి చెందిన అమెరికన్  ఆస్ట్రోనాట్  (వ్యోమగామి) సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వాయిదా పడింది. బోయింగ్ స్టార్ లైనర్‌లో ఆమె ప్రయాణించాల్సి ఉండగా కొన్ని గంటల ముందు సాంకేతిక కారణాల కారణంగా వాయిదా పడింది. మళ్లీ యాత్ర నిర్వహించే తేదీని త్వరలోనే వెల్లడిస్తామని నాసా తెలిపింది.

 భారత కాలమానం ప్రకారం.. ఈ స్పేస్ క్రాఫ్ట్ మే 7 ఉదయం 8.04 గంటలకు ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్​(ఐఎస్ఎస్​)కు బయలుదేరాల్సి ఉంది. ఇందులో సునీతా విలియమ్స్​తోపాటు మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ మిషన్ పైలట్​గా వ్యవహరించారు.

ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్‌లోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్ కు చెందిన అట్లాస్ V రాకెంట్ నింగిలోకి దసూకెళ్లడానికి  బయలుదేరడానికి సిద్ధమైంది. సరిగ్గా  90 నిముషాల ముందు ఆపేస్తున్నట్లు అమెరికా నాసా ప్రకటించింది.   NASA ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్‌పై పరిస్థితి అసాధరణంగా  ఉందని ప్రకటించింది. దీంతో సునీతా విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామి విల్ మోర్ అంతరిక్ష నౌక నుంచి బయటకు వచ్చేశారు.