మార్చి 16న భూమి మీదికి సునీత, విల్మోర్ రాక

మార్చి 16న భూమి మీదికి సునీత, విల్మోర్ రాక

వాషింగ్టన్: ఇంటర్​నేషనల్ స్పేస్ సెంటర్(ఐఎస్ఎస్)లో చిక్కుకు పోయిన నాసా ఆస్ట్రొనాట్లు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్​ను భూమి మీదకు తీసుకువచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 16న వాళ్లిద్దరినీ తీసుకువస్తామని నాసా అధికారులు సోమవారం ప్రకటించారు. 

ఎలాన్ మస్క్​కు చెందిన స్పేస్‌‌‌‌‌‌‌‌ఎక్స్ డ్రాగన్‌‌‌‌‌‌‌‌లో సునీత, విల్మోర్​ను భూమిపైకి తీసుకురానున్న ట్లు  స్పష్టం చేశారు. ఈ ఇద్దరు ఆస్ట్రొనాట్లు 10 రోజుల ప్రోగ్రాంలో భాగంగా పోయినేడాది జూన్ 5న బోయింగ్ స్టార్ ​లైనర్​లో స్పేస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడికి చేరుకున్నాక స్టార్​లైనర్​లో హీలియం లీకేజీ కారణంగా సమస్యలు తలెత్తాయి. దీంతో వారు తిరిగి రాలేకపోయా రు. దాదాపు 9 నెలలుగా ఐఎస్ఎస్​లోనే ఉండిపోయారు.