స్టార్ లైనర్ సక్సెస్.. సునీత విలియమ్స్ డ్యాన్స్.. వీడియో వైరల్

భారత సంతతి మహిళా ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ అరుదైన ఘనత సాధించారు.కొత్త స్పేస్ క్రాఫ్ట్ కు పైలట్ గా వ్యవహరించి, టెస్ట్ చేసిన తొలి మహిళా ఆస్ట్రోనాట్ గా రికార్డ్ సృష్టించారు. ఈ నేపథ్యంలో తన సహచరులతో ఆనందాన్ని పంచుకుంటూ ఆమె డ్యాన్స్ చేశారు.ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. గురువారం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ( ISS ) ఈ చారిత్రాత్మక ఘట్టానికి వేదిక అయ్యింది.

బోయింగ్ స్టార్ లైనర్ టెస్ట్ సక్సెస్ అవ్వటంతో సునీత విలియమ్స్ స్పేస్ క్రాఫ్ట్ కు పైలట్ గా వ్యవహరించిన తొలి మహిళా వ్యోమగామిగా నిలిచారు.ఈ క్రమంలో స్పేస్ స్టేషన్ లోని 7మంది సిబ్బంది ఆమె స్వాగతం పలికారు.తన సహచరుల స్వాగతానికి కృతజ్ఞత తెలిపిన సునీత విలియమ్స్, టీంను మరో కుటుంబంలా భావిస్తానని అన్నారు. స్టార్ లైనర్ డిజైనింగ్ విషయంలో సునీత కీలకంగా వ్యవహరించారు.