జాగ్రత్తగా లేకపోతే ఎముకలు విరిగిపోతాయి.. మళ్లీ నడక నేర్చుకోనున్న సునీతా విలియమ్స్

జాగ్రత్తగా లేకపోతే ఎముకలు విరిగిపోతాయి.. మళ్లీ నడక నేర్చుకోనున్న సునీతా విలియమ్స్

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ సురక్షితంగా అంతరిక్షం నుంచి భూమ్మీదకు చేరుకున్నారు. అయితే.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతం ఆందోళన నెలకొంది. ఇన్ని నెలలు అంతరిక్షంలో ఉండటంతో భూమ్మీదికొచ్చాక ఆమె నడవలేని పరిస్థితి ఉంది. సునీతా విలియమ్స్ వయసు ప్రస్తుతం 59 సంవత్సరాలు. అంటే.. దాదాపు 60 సంవత్సరాలు. ఇప్పటికి ఐదు సార్లు ఆమె అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు.

వయసు రీత్యా ఎదురయ్యే మానసిక, శారీరక ఒత్తిడి ఉంటుంది. ఎక్కువ రోజులు స్పేస్లో ఉండటంతో బుచ్ విల్​మోర్ కంటే సునీతా విలియమ్స్ మానసికంగా, శారీరకంగా చాలా ఒత్తిడికి గురయ్యారు. స్పేస్లో గ్రావిటీ ఉండదు. దీంతో ఆస్ట్రొనాట్లు ఐఎస్ఎస్లో గాల్లో తేలుతుంటారు. భూమిపైకి వస్తే అలాంటి పరిస్థితి ఉండదు. అందుకే వారికి స్పెషల్ ట్రీట్​మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.

భూమిపై అడుగుపెట్టాక వాళ్లు నడవలేరు. నెలల పాటు ఎక్సర్​సైజ్లు చేయాల్సి ఉంటుంది. వారు సొంతంగా నడిచేంత వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారు. కండరాల క్షీణత, ఎముకల సాంద్రత తగ్గుతుంది. తల తిరగడం వంటి సమస్యలతో ఇబ్బందిపడొచ్చు. స్పేస్లో ఉన్నప్పుడు బాడీలోని లిక్విడ్స్ పైకి కదులుతాయి. దీనివల్ల రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి. లో బీపీ,  ఎముకల కదలికల్లో నొప్పి ఉండొచ్చు. కంటి చూపుతో పాటు గుండె సంబంధిత సమస్యలూ ఎదురవుతాయి.

Also Read:-భూమి మీద అడుగుపెట్టిన సునీతా విలియమ్స్.. 9 నెలల నిరీక్షణకు తెర..

భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్​సునీతా విలియమ్స్ భారత కాలమానం ప్రకారం బుధవారం వేకువజామున సుమారు 3:27 గంటలకు ఫ్లోరిడా తీరానికి దగ్గరలో ఉన్న అట్లాంటిక్ సముద్ర జలాల్లో ల్యాండ్ అయ్యారు. అందులో నుంచి ఒక్కొక్కరుగా ఆస్ట్రొనాట్లు బయటికి వచ్చారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తక పోవడంతో అనుకున్న  సమయానికే ఆస్ట్రొనాట్లు భూమిపై అడుగుపెట్టారు.

9 నెలలు స్పేస్లోనే ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది ?
వ్యోమనౌక ‘స్టార్​లైనర్’ ప్రొపల్షన్ సిస్టమ్‌‌‌‌లో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడంతో పాటు హీలియం కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రొనాట్లను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సేఫ్ కాదని ఆగస్టు నెలాఖరు నాటికి నాసా నిర్ణయానికి వచ్చింది. దీంతో ఆస్ట్రొనాట్​లు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ 2024, సెప్టెంబర్ 7న భూమికి తిరిగి వచ్చింది. సునీతా, విల్​మోర్ లను తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్‌‌‌‌ ఎక్స్‌‌‌‌లు కలిసి క్రూ 10 మిషన్‌‌‌‌ను చేపట్టాయి. శనివారం నలుగురు ఆస్ట్రొనాట్లతో కూడిన ఫాల్కన్‌‌‌‌ 9 రాకెట్‌‌‌‌ నింగిలోకి దూసుకెళ్లింది.