![డేంజర్ జోన్లో సునీత విలియమ్స్.. రాక మరింత జాప్యం.. అనారోగ్యం ముప్పు..](https://static.v6velugu.com/uploads/2024/07/sunita-williams-return-journey-will-delay-for-few-more-days_bNkiKBZ0U8.jpg)
భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్రకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఆమె ప్రయాణించిన స్టార్ లైనర్ వ్యోమ నౌకలో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరుగు ప్రయాణం ఆలస్యమవుతోంది.8రోజుల అంతరిక్ష పర్యటనలో భాగంగా జూన్ 5న అంతరిక్షానికి వెళ్లిన సునీత విలియమ్స్ ఇప్పటికీ తిరిగి రాలేదు. తాజాగా నాసా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.ఆమె రాకకు 48 నుండి 90రోజుల సమయం పట్టే అవకాశం ఉందని నాసా తెలిపింది.
సునీత విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామి విల్మోర్ అనే మరో వ్యోమగామి కూడా అంతరిక్షంలోని చిక్కుకుపోయారు.స్పేస్ లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి కాబట్టి రోజులు గడిచే కొద్దీ సునీతకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉందని తెలిపింది నాసా.గతంలో పలుమార్లు అంతరిక్ష పర్యటనకు వెళ్లి సురక్షితంగా తిరిగొచ్చిన సునీత ఇప్పుడు కూడా సురక్షితంగా తిరిగొస్తుందని కుటుంబసభ్యులు, సహచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.