వాషింగ్టన్: అస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ స్పేస్ నుంచి తిరిగి రావడం మరింత ఆలస్యం కానుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తెలిపింది. వచ్చే ఏడాది మార్చిదాకా వాళ్లు అక్కడే ఉంటారని మంగళవారం ప్రకటించింది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఈ ఏడాది జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు చేరుకున్నారు. నిజానికి వీళ్లు జూన్ 14న తిరిగి రావాల్సి ఉండగా, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు.
టెక్నికల్ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆస్ట్రోనాట్లను అక్కడే వదిలి స్టార్ లైనర్ తిరిగి వచ్చేసింది. అప్పటినుంచి వాళ్లను భూమిమీదికు రప్పించేందుకు నాసా చేస్తున్న ప్రయత్నాలు ఫెయిల్ అవుతున్నాయి. కొద్దిరోజుల కిందే సునీత, విల్మోర్ను ఫిబ్రవరిలోనే భూమిమీదికి తీసుకొస్తామని ప్రకటించిన నాసా.. తాజాగా మార్చి నెలాఖరుదాకా వాళ్లను తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టలేమని స్పష్టం చేసింది.