వాషింగ్టన్: ఇండో అమెరికన్ ఆస్ట్రొనాట్ సునీతా విలియమ్స్ చేపట్టాల్సిన బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ షటిల్ ప్రయోగం చివరి నిమిషంలో నిలిచిపోయింది. రాకెట్లో సాంకేతిక లోపం కారణంగానే లాంచింగ్‌ను వాయిదా వేసినట్లు అమెరికాకు చెందిన నాసా ప్రకటించింది. దీంతో మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమైన సునీతా విలియమ్స్ ప్రయాణానికి బ్రేక్ పడినట్లయింది.
రాకెట్లో టెక్నికల్ సమస్య..
ఇండియా టైమింగ్స్ ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి అట్లాస్ వి రాకెట్.. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్(ఐఎస్ఎస్)కు బయల్దేరాల్సి ఉంది. అయితే, లిఫ్ట్ ఆఫ్‌కు 90 నిమిషాల ముందు రాకెట్ ప్రయోగాన్ని రద్దు చేశారు. అందులోని ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్ పనితీరులో తేడాలున్నట్లు గుర్తించినట్లు నాసా సైంటిస్టులు వెల్లడించారు. దీంతో అప్పటికే స్పేస్ క్రాఫ్ట్‌లో ఉన్న సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఆస్ట్రొనాట్ బుచ్ విల్మోర్ సేఫ్‌గా కిందకు దిగారు. స్టార్ లైన్ ప్రయోగం తిరిగి ఎప్పుడు చేపడతారనే విషయం మాత్రం నాసా వెల్లడించలేదు.