మార్చి 19న భూమి మీదకు సునీతా విలియమ్స్

మార్చి 19న భూమి మీదకు సునీతా విలియమ్స్

న్యూఢిల్లీ:  ఎనిమిది నెలలకు పైగా అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన నాసా ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మార్చి నెలలో భూమిపైకి రానున్నారు. ఈ మేరకు వీరిద్దరు స్పేస్ నుంచి ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా బుచ్ విల్మోర్ మాట్లాడుతూ.."మార్చి 12న స్పేస్ఎక్స్ కు చెందిన క్రూ-10  అంతరిక్ష నౌకను భూమి నుంచి ఐఎస్ఎస్ కు పంపనున్నారు.

 ఒక వారంలో మేం దాంట్లో భూమికి చేరుకుంటాం. మా బాధ్యతలను క్రూ-10  అంతరిక్ష నౌకలో ఐఎస్ఎస్ కు వచ్చిన వ్యోమగాములు తీసుకోనున్నారు" అని విల్మోర్ పేర్కొన్నారు.  ఎనిమిది రోజుల మిషన్ భాగంగా సునీత  విలియమ్స్, విల్మోర్ గతేడాది జూన్ 6న అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.