భూమిపైకి బయలుదేరిన సునీత: స్పేస్ స్టేషన్ నుంచి అన్ లాక్ అయిన డ్రాగన్

భూమిపైకి బయలుదేరిన సునీత: స్పేస్ స్టేషన్ నుంచి అన్ లాక్ అయిన డ్రాగన్

అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపైకి బయలుదేరారు. 2025, మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల 25 నిమిషాల సమయంలో.. అంతరిక్ష కేంద్రం (ISS) ఇంటర్నేషన్ స్పేస్ సెంటర్ నుంచి డ్రాగన్ అన్ లాక్ అయ్యింది. 18 గంటల ప్రయాణం తర్వాత అమెరికాలోని ఫ్లోరిడా సమీపంలో డ్రాగన్ ల్యాండ్ అవుతున్నట్లు ప్రకటించింది నాసా.

Also Read :- భూమి మీదకు బయలుదేరిన సునీత విలియమ్స్

ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ 9 డ్రాగన్ ను నలుగురు వ్యోమగాములు స్పేస్ సెంటర్ కు వెళ్లారు. వాళ్లు స్పేస్ సెంటర్ లోకి ఎంటర్ అయిన 24 గంటల తర్వాత.. అదే క్రూ 9లో.. తొమ్మిది నెలల తర్వాత సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ తిరిగి భూమిపైకి బయలుదేరారు.

స్పేస్ సెంటర్ నుంచి డ్రాగన్ విజయవంతంగా విడిపోయిందని.. తన ప్రయాణాన్ని ప్రారంభించిందని.. భూమిపైకి ల్యాండ్ కావటానికి 18 గంటల సమయం పడుతుందని సానా వెల్లడించింది. ఎనిమిది రోజుల కోసం బోయింగ్ చెందిన అంతరిక్ష నౌకలో స్పేస్ సెంటర్ కు వెళ్లారు సునీత, విల్మోర్. విజయవంతంగా స్పేస్ సెంటర్కు కనెక్ట్ అయిన బోయింగ్ నౌక.. ఆ తర్వాత నెట్రోజన్, ఇతర ఆయిల్ లీకేజీ కారణంగా ఫెయిల్ అయ్యింది. దీంతో ఆ క్రూలో వెళ్లిన సునీత, విల్మోర్ లను వదిలేసి.. బోయింగ్ నౌక తిరిగి వచ్చేసింది. అప్పటి నుంచి వాళ్లిద్దరూ.. తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు.