కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు కష్టాలొస్తయ్: గొంగిడి సునీత

యాదగిరిగుట్ట, వెలుగు: కాంగ్రెస్‌కు అవకాశమిస్తే కరెంట్‌ కష్టాలు కొనితెచ్చుకున్నట్లేనని  బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీత హెచ్చరించారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం, కాచారం, కమటంగూడెం, చిన్నగౌరాయపల్లి, గౌరాయపల్లి, సాదువెల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామంటున్నారని, అదే జరిగితే రైతుబంధు, రైతుభీమా ఆగిపోతుందన్నారు.  

24 గంటల కరెంటు పోయి 3 గంటల కరెంటు వస్తుందని, దీంతో రైతులకు మళ్లీ పాత కష్టాలు వస్తాయని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు మోసపూరితమైన హామీలతో మభ్యపెట్టాలని చూస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  అలాగే  రాజాపేట మండలం బేగంపేట, తుర్కపల్లి మండలం మాదాపూర్, గుండాల మండలం పెద్దపడిశాల, బొమ్మలరామారం మండలం ఫక్కీర్ గూడెం, మేడిపల్లి, మాచన్ పల్లి గ్రామాలకు చెందిన 500 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు.. శుక్రవారం డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.