టీడీపీ ఎంపీ మాగుంటపై కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు..

టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై డిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ మాగుంట ఇచ్చిన తప్పుడు స్టేట్మెంట్ వల్లే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారని అన్నారు సునీత. ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలోకి ఎంటర్ అవ్వాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100కోట్లు చెల్లించాల్సి ఉంటుందని కేజ్రీవాల్ కొంతమందిని డిమాండ్ చేసినట్లు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈడీ అధికారులకు స్టేట్‌మెంట్ ఇచ్చాడని, ఇది పూర్తిగా అవాస్తవం అని సునీత కేజ్రీవాల్ అన్నారు సునీత కేజ్రీవాల్.

మూడో వ్యక్తి ఉన్నప్పుడు ఎవరైనా లంచం ఎలా డిమాండ్ చేస్తారంటూ ప్రశ్నించారు సునీత.బెయిల్ కోసమే మాగుంట.. ఈడీ అధికారుల వద్ద తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చారని సునీత ఆరోపించారు. ఢిల్లీలో మద్యం వ్యాపారం ఆరంభించాలంటూ కేజ్రీవాల్ తనను ఒత్తిడి పెట్టాడని, దీనికోసం 100 కోట్ల రూపాయలను లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారంటూ మాగుంట ఇచ్చిన స్టేట్‌మెంట్ పూర్తిగా అవాస్తవమని అన్నారు సునీత.