
కౌడిపల్లి, వెలుగు: అధికారులు ప్రొటోకాల్ పాటించకపోతే సీరియస్ యాక్షన్ ఉంటదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హెచ్చరించారు. సోమవారం జరిగిన కౌడిపల్లి మండల పరిషత్జనరల్ బాడీ మీటింగ్కు ఆమె హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే, ఎంపీపీ, జడ్పీటీసీలకు, అధికారులకు చెప్పి పనులు జరిపించాలి కానీ ఇష్టం వచ్చినట్లు పనులు చేస్తే బాగుండదని స్పెషల్ ఆఫీసర్లను హెచ్చరించారు.
గత జనరల్ బాడీ మీటింగ్లో తీర్మానాలు చేసిన పనులు మళ్లీ మీటింగ్వరకు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. గవర్నమెంట్హాస్పిటల్లో డాక్టర్లు అందుబాటులో ఉండడంలేదని డాక్టర్ ప్రవీణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ రాజు నాయక్ మాట్లాడుతూ.. తాను గిరిజనుడిని అయినందునే ప్రారంభోత్సవాలు, సమావేశాలకు స్పెషల్ ఆఫీసర్లు సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల్లో సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పంచాయతీ శాఖ డీఈ అమరేశ్, ఏఈ ప్రభాకర్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్ లు పాల్గొన్నారు.
శివ్వంపేట: మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. పిల్లుట్ల, లింగోజిగూడ, సామ్య తండా, రెడ్యా తండా జీపీలలో సీసీ రోడ్ల నిర్మాణం, వెంక్య తండా నుంచి చండి, గోమారం మీదుగా పెద్ద గొట్టిముక్కుల వరకు 3 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేశ్ గుప్తా, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణ గౌడ్ పాల్గొన్నారు.