బీఆర్ఎస్​కు సుంకరి మల్లేశ్​గౌడ్​ గుడ్​ బై

  •      ఈనెల 24న జిల్లా మంత్రుల సమక్షంలో కాంగ్రెస్​లో చేరనున్న మల్లేశ్ గౌడ్​

నల్గొండ, వెలుగు : బీఆర్ఎస్​కు​ సీనియర్​నేత సుంకరి మల్లేశ్​గౌడ్ గుడ్​బై చెప్పారు. ఈనెల 24న కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్​రెడ్డి నామినేషన్​సందర్భంగా జిల్లా మంత్రుల సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు మల్లేశ్​గౌడ్​శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం ఆయన చిట్యాల మండలం ఉరుమడ్ల సొసైటీకి చైర్మ న్​గా ఉన్నారు. గతంలో జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షుడిగా పనిచేసిన మల్లేశ్ గౌడ్​దివంగత మాజీ ఎమ్మెల్యే ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి శిష్యుడిగా పార్టీలో విశేష సేవలు అందించారు.

కాంగ్రెస్ లో సుధీర్ఘకాలం పనిచేసిన మల్లేశ్​గౌడ్​జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్​కుమార్​రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు, జిల్లా మంత్రులతో చర్చించిన తర్వాత ఆయన కాంగ్రెస్​లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.