చొప్పదండి/గంగాధర, వెలుగు : చొప్పదండి నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ అన్నారు. మంగళవారం చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో వివిధ సంఘాలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో రవిశంకర్పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ గతంలో తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రామడుగు మండలం గోపాల్రావుపేటకు చెందిన నేచర్ యూత్ క్లబ్ సభ్యులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.