మైత్రీ నిర్మాతల మాస్టర్ ప్లాన్.. పుష్ప 2తో బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్..

మైత్రీ నిర్మాతల మాస్టర్ ప్లాన్.. పుష్ప 2తో బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని గత ఏడాది నందమూరి బాలకృష్ణ హీరోగానటించిన వీర సింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో ఈసారి ఏకంగా బాలీవుడ్ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కించుకున్నాడు. అయితే ప్రస్తుతం గోపీచంద్ మలినేని హిందీలో  "జాట్" అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాలో హీరోగా ప్రముఖ హీరో సన్నీ డియోల్ నటిస్తున్నాడు. పవర్ఫుల్ స్టోరీతో యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్ లో గోపిచంద్ మాలినేని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. 

తెలుగు ప్రముఖ సినీ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ తదితరులు కలసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా 80% శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

అయితే ఈ సినిమాకి సంబందించిన టీజర్ అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఇందులోభాగంగా పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతున్న థియేటర్లలో సినిమా ప్రసారానికి ముందు జాట్ సినిమా టీజర్ ప్రసారం అవుతుందని తెలిపారు. ఈ క్రమంలో జాట్ సినిమాకి సంబందించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో సన్నీ డియోల్ పవర్ఫుల్ లుక్ లో కనిపించాడు. 

అయితే పుష్ప 2 నిర్మాతలు, జాట్ సినిమా నిర్మాతలు ఒక్కరే కావడంతో పనిలోపనిగా జాట్ ప్రమోషన్స్ కూడా కలిసి వస్తోందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పుష్ప 2 వరల్డ్ వైడ్ దాదాపుగా 12500 స్క్రీన్స్ లో గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. దీంతో నిర్మాతల ఐడియా అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.