సమ్మర్‌‌‌‌లో సన్నీ డియోల్ జాట్‌‌

సమ్మర్‌‌‌‌లో సన్నీ డియోల్  జాట్‌‌

బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న హిందీ చిత్రం ‘జాట్‌‌’.  మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌‌పై నవీన్ యెర్నేని,  వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ  చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌లో యాక్షన్ ప్యాక్ట్‌‌ అవతార్‌‌‌‌లో కనిపించారు సన్నీ డియోల్.  

ఇక ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌‌‌‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.  ఇందులో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్,  రెజీనా కాసాండ్రా ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనల్ అరసు, రామ్ లక్ష్మణ్, వెంకట్ ఫైట్ మాస్టర్స్‌‌గా వర్క్ చేస్తున్నారు.  తమన్ సంగీతం అందిస్తున్నాడు.