బాలీవుడ్ నటి సన్నీలియోనీ మళ్లీ పెళ్లి చేసుకుంది. మాల్దీవుల్లో ఆమె పెళ్లి ఘనంగా జరిగింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆమె పెళ్లికి అతిథులుగా ఆమె పిల్లలు హాజరయ్యారు. హైలైట్ ట్విస్ట్ ఏంటంటే.. ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంది మరెవరినో కాదు ఆమె భర్త డేనియల్ వెబర్నే.
అక్టోబర్ 31, 2024కు సన్నీలియోనీ, డేనియల్ పెళ్లి చేసుకుని 13 ఏళ్లయింది. ఈ స్పెషల్ డేను మరింత మెమొరబుల్‌గా మార్చుకునేందుకు మాల్దీవ్స్‌లో ఈ దంపతులు మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వీరి ముగ్గురు పిల్లలు నిషా, నోహ్, అషర్ పెళ్లిలో అతిథులు లేని లోటు తీర్చారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.
Ladies and gentlemen - them!💞#SunnyLeone and #DanielWeber renewed their vows in an intimate ceremony. #Celebs pic.twitter.com/wcs8Onek8j
— Filmfare (@filmfare) November 4, 2024
అమ్మానాన్నల పెళ్లికి అతిథులగా మారే అదృష్టం సన్నీలియోన్ పిల్లలకు దక్కిందని నెటిజన్లు పరవశంతో కామెంట్ చేస్తు్న్నారు. దీపావళి సందర్భంగా పిల్లలకు సెలవులు ఇవ్వడంతో ఈ జంట పిల్లలతో కలిసి మాల్దీవులకు వెళ్లింది. పెళ్లి గొప్పదనాన్ని పిల్లలకు కూడా చాటి చెప్పేందుకు ఇలా మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు సన్నీలియోనీ సన్నిహితులు చెప్పారు.
సన్నీకి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే మొదట ఓ పాపని దత్తత చేసుకుంది. తర్వాత సరోగసీ ద్వారా కవలలకు తల్లయ్యింది. అటు సినిమాలు, ఇటు కుటుంబాన్ని చూసుకుంటూనే వ్యాపారంలోనూ రాణిస్తోంది. కాస్మొటిక్స్, పర్ఫ్యూమ్స్ బిజినెస్ చేస్తోంది. సినిమాల్లో నటిస్తోంది.
ALSO READ : Naga Chaitanya,Sobhita: నాగ చైతన్య - శోభిత మ్యారేజ్ డేట్ ఫిక్స్.. పెళ్లి ఎక్కడంటే?
సన్నీ లియోనీకి ఇండియాలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేరళ రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీలో కల్చరల్ ప్రోగ్రాంకు సన్నీలియోన్ వెళుతుందని తెలిసి అప్పట్లో ఈవెంటే క్యాన్సిల్ చేసిన పరిస్థితి. తిరువనంతపురం యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాంపస్‌లో ఈవెంట్ జరగాల్సి ఉండగా పోలీసులు ఆ యూనివర్సిటీ కల్చరల్ ప్రోగ్రాంకు పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. సన్నీలియోనీ వస్తే వచ్చే జనాన్ని కంట్రోల్ చేయలేమని పోలీసులు తేల్చి చెప్పారు.