పర్సనల్ లోన్లు ఇప్పిస్తామంటూ పాన్ కార్డు, ఆధార్, పుట్టినతేదీ వివరాలు కావాలంటూ కస్టమర్ కేర్ నుండి ఫోన్ కాల్స్ రావడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో సైబర్ నేరాలు జరుగుతున్నాయని.. జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్న ఎక్కడోచోట మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు నటి సన్నీలియోనీ కూడా ఇలాంటి మోసానికే గురైందట. తన పాన్ నెంబర్ ను ఎవరో దుర్వినియోగం చేశారని ఆరోపించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలిపిన సన్నీ.. ‘‘ఎవరో ఇడియట్ నా పాన్ కార్డు సాయంతో రూ.2,000 రుణం తీసుకున్నాడు. నా సిబిల్ స్కోరును దెబ్బతీశాడు. ఈ విషయంలో ధనిస్టాక్స్ సెక్యూరిటీస్ నాకు సాయం చేయలేదు. ఇండియాబుల్స్ దీన్ని ఎలా అనుమతిస్తుంది’’ అంటూ సన్నీ లియోనీ ట్వీట్ చేసింది.
నిజానికి సన్నీ లియోనీ ఒక్కరే బాధితురాలు కాదు. నిత్యం వందలాది మోసాలు ఇలానే జరుగుతున్నాయంటూ ఆమె ట్వీట్ కు రీట్వీట్స్ చేశారు. ఐవీఎల్ సెక్యూరిటీస్ వంటి డిజిటల్ యాప్స్ ను మోసగాళ్లు వేదికలుగా చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం హాట్ టాపిక్ కావడంతో ఐవీఎల్ సెక్యూరిటీస్ స్పందించింది. మిస్టేక్ జరిగినట్లు ఐవీఎల్ సెక్యూరిటీస్ తెలపడంతో.. తన సమస్య పరిష్కారమైనట్టు సన్నీ చెప్పింది. ‘‘ఐవీఎల్ సెక్యూరిటీస్, ఐబీ హోమ్ లోన్స్, సిబిల్ కు ధన్యవాదాలు. వేగంగా నా సమస్యను పరిష్కరించారు. మరోసారి ఇది రిపీట్ కాదని భావిస్తున్నాను. ఇదే విధమైన సమస్య ఇతరులకు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటారని ఆశిస్తాను. చెత్త సిబిల్ స్కోర్ ను ఎవరూ కోరుకోరు’’అంటూ మరో ట్వీట్ ను సన్నీ వదిలింది.
Thank you @IVLSecurities @ibhomeloans @CIBIL_Official for swiftly fixing this & making sure it will NEVER happen again. I know you will take care of all the others who have issues to avoid this in the future. NO ONE WANTS TO DEAL WITH A BAD CIBIL !!! Im ref. to my previous post.
— sunnyleone (@SunnyLeone) February 17, 2022