రాయ్‌పూర్: సినీనటి సన్నిలియోన్ఖాతాలో చత్తీస్ గఢ్సర్కారు నెలనెలా రూ.వెయ్యి పింఛన్జమ చేస్తున్నది. రికార్డుల్లో ఆమె పేరు, ఫొటో స్పష్టంగా ఉన్నాయి. ఓ వ్యక్తి ఫోర్జరీ డాక్యుమెంట్స్‌తో పింఛన్‌కు అప్లై చేయగా.. అధికారులు గుడ్డిగా సంతకాలు చేయడంతో అర్హుల ఖాతాలో సన్నీలియోన్పేరు చేరిపోయింది. బస్తర్ రీజియన్‌లోని తాలూర్ గ్రామంలో తాజాగా ఈ మోసం బయటపడింది. దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించగా.. గ్రామానికి చెందిన వీరేంద్ర జోషి ఈ మోసానికి పాల్పడినట్టు తేలింది. చత్తీస్ గఢ్లోని బీజేపీ ప్రభుత్వం వివాహిత మహిళల కోసం ‘మహతారి వందన యోజన’ స్కీమ్‌ను అమలు చేస్తున్నది.
దీనికింద నెలానెలా రూ. వెయ్యి పింఛన్అందజేస్తున్నది. ఈ క్రమంలోనే ఓ యువకుడు సన్నిలియోన్ఫొటో, ఆమె పేరుతో ఫోర్జరీ డాక్యుమెంట్స్సృష్టించి అప్లై చేశాడు. అధికారులు కనీసం పరిశీలించకుండా ఓకే చేయడంతో.. ఆ ఖాతాలో ఈ ఏడాది మార్చి నుంచి నెలనెలా ఠంచన్‌గా వెయ్యి రూపాయల పింఛన్ పడుతున్నది. కాగా, ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు వీరేంద్ర జోషిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పింఛన్క్రెడిట్ అవుతున్న బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్‌చేశారు. అతడికి సహకరించిన అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్పై క్రమశిక్షణా చర్యలకోసం సిఫారసు చేశారు.