Sunny Leone: తెలుగులో హారర్తో వస్తోన్న స‌న్నీ లియోన్..బోల్డ్ బ్యూటీకి భయపడతారా మరి!

Sunny Leone: తెలుగులో హారర్తో వస్తోన్న స‌న్నీ లియోన్..బోల్డ్ బ్యూటీకి భయపడతారా మరి!

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్‌ (Sunny Leone)కు టాలీవుడ్‌లో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఎప్పుడు తనదైన ఫోటో షూట్స్తో, వీడియోస్తో ఇంస్టాగ్రామ్ను షేక్ చేసే పనిలో ఉంటుంది. అపుడప్పుడు కుర్రాళ్లను షాక్ కు గురి చేసేలా చేస్తోంది. అంతేకాకుండా..సన్నీ లియోన్‌ హిందీ,తెలుగు,తమిళ,మలయాళ,కన్నడ భాషల్లో మూవీస్, షోస్, ఐటెం సాంగ్స్ చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో మంచు మనోజ్ కరెంట్ తీగ, రాజశేఖర్ PSV గరుడవేగా, మంచు విష్ణు జిన్నా మూవీస్లో నటించింది. ఐ 

ఇదిలా ఉంటే..ప్రస్తుతం సన్నీ లియోన్ తెలుగులో ఓ సినిమా చేస్తోంది.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్‌,ఫ‌స్ట్‌లుక్‌ పోస్టర్ని రిలీజ్ చేశారు.ఈ మూవీకి 'మందిర'(Mandira)అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక పోస్టర్ విషయానికి వస్తే..త‌ల‌పై కిరీటం ధ‌రించి రాజుల కాలం వ‌స్త్రాధార‌ణ‌లో మహారాణిగా స‌న్నీలియోన్ లుక్ ఆకట్టుకుంటోంది. అయితే స‌న్నీ మాత్రం నెగెటివ్ షేడ్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు పోస్ట‌ర్ చూస్తుంటే అర్ధమవుతోంది. ఈ సినిమాకు ఆర్ యువ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

Also Read: రాజమౌళి సినిమా కోసం..మ్యాన్లీ లుక్స్తో మత్తెక్కిస్తున్న మహేష్ బాబు

మందిర సినిమా విషయానికి వస్తే..స‌న్నీ లియోన్ ప్రధాన పాత్రలో త‌మిళంలో 2022లో రిలీజైన ఓ మై ఘోస్ట్‌కు డ‌బ్ వెర్ష‌న్‌గా మందిర తెలుగులో రిలీజ్ కాబోతున్న‌ట్లు సమాచారం. హార‌ర్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ ఆడియన్స్ నుంచి డిజాస్టర్ టాక్ మూట‌గ‌ట్టుకున్న‌ది. 

మొదట పోర్న్‌స్టార్‌గా కెరియర్‌ను స్టార్ట్ చేసిన సన్నీలియోన్..నటిగా బాలీవుడ్‌లో జిస్మ్ 2మూవీతో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకుంది. నటిగా, హాట్ స్టార్ గా ఎంతో మంది ఫ్యాన్స్ ను తన చుట్టూ ముడేసుకున్న సన్నీ లియోన్..ప్రస్తుతం సౌత్ సినిమాల్లో కూడా ఫుల్ బిజీ అయిపోయే రోజులు వస్తున్నాయి.