
- ఈస్ట్ జోన్ డీసీపీగా అంకిత్ కుమార్ సాక్వార్
వరంగల్, వెలుగు: వరంగల్ పోలీస్ కొత్త కమిషనర్‍గా సన్‍ప్రీత్ సింగ్‍ను నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న సీపీ అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనరేట్‍కు బదిలీపై వెళ్లారు. 2023 అక్టోబర్ 13 నుంచి ఆయన సీపీగా ఉన్నారు. 2011 ఐపీఎస్ బ్యాచ్‍కు చెందిన సన్‍ప్రీత్‍సింగ్ ఇన్నాళ్లూ సూర్యాపేట ఎస్పీగా పనిచేశారు.
సన్‍ప్రీత్‍కు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది. 2012లో ములుగు ఏఎస్పీగా, వరంగల్ రూరల్ ఓఎస్డీగా పనిచేశారు. వరంగల్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ డీసీపీగా 2020 బ్యాచ్‍కు చెందిన అంకిత్ కుమార్ సాక్వార్‍ను నియమించారు. ఆయన గతంలో వరంగల్‌లో ట్రైనీ ఆఫీసర్‍గా పనిచేశారు. ప్రస్తుతం ఈస్ట్‌జోన్ డీసీపీగా వ్యవహరిస్తున్న పి.రవీందర్ సీఐడీ విభాగం ఎస్పీగా బదిలీపై వెళ్లారు.
వరంగల్ కమిషనరేట్ కొత్త క్రైం డీసీపీగా జనార్దన్‌ను నియమించారు. ట్రాన్స్ కో విభాగంలో అదనపు ఎస్పీగా పని పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ క్రైమ్ డీసీపీ నియమించింది. గతంలో ఆయన ఎస్సై, సీఐ, ఏసీపీగా ఇదే కమిషనరేట్ లో పనిచేశారు.