చిన్నపిల్లలతో భిక్షాటన చేయిస్తే చర్యలు

జగిత్యాల టౌన్, వెలుగు:  చిన్న పిల్లలతో భిక్షాటన చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. పిల్లల  రవాణపై, బాలలతో వెట్టి చాకిరి చేయించడంపై   8712656810 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. తప్పిపోయిన, వదిలివేయబడిన, కార్మికులుగా ఉన్న బాల బాలికలు ఉన్నట్లయితే వారి సమాచారం సేకరించి రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్టు తెలిపారు.