- కోల్‌కతాతో రాజస్తాన్ రాయల్స్ పోరు
హైదరాబాద్, వెలుగు : ఐపీఎల్‌లో మూడేండ్ల తర్వాత ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న ఉత్సాహంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ అదే జోరుతో టాప్2 ప్లేస్ సాధించాలని ఆశిస్తోంది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం జరిగే తమ చివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించడమే టార్గెట్‌గా బరిలోకి దిగనుంది. గుజరాత్ టైటాన్స్‌తో గత పోరు వర్షంతో రద్దవడంతో ఓ పాయింట్ ఖాతాలో వేసుకొని ప్లే ఆఫ్స్ చేరిన హైదరాబాద్.. పంజాబ్‌పై గెలిస్తే మొత్తం17 పాయింట్లకు చేరుకుంటుంది. .
మరోవైపు గువాహతిలో జరిగే చివరి లీగ్ పోరులో రాజస్తాన్‌ను టేబుల్ టాపర్ కేకేఆర్ ఓడిస్తే రైజర్స్ రెండో స్థానం దక్కించుకోనుంది. ఈ నేపథ్యంలో టాప్2లో నిలిచి క్వాలిఫయర్1 ఆడే అవకాశాన్ని వదులుకోవద్దని సన్ రైజర్స్ కృతనిశ్చయంతో ఉంది. ఇక, గాయంతో పంజాబ్ కెప్టెన్ ధవన్ జట్టుకు దూరంగా ఉండగా.. స్టాండిన్ కెప్టెన్‌గా ఉన్న సామ్ కరన్‌తో పాటు జానీ బెయిర్ స్టో, క్రిస్ వోక్స్ స్వదేశానికి వెళ్లిపోవడంతో డీలా పడ్డ టీమ్‌కు జితేశ్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
అయితే, ఈ మ్యాచ్‌కూ వాన ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. శనివారం సాయంత్రం వర్షం కారణంగా రైజర్స్ తమ ప్రాక్టీస్‌ను మధ్యలోనే ఆపేసింది.